నమస్తే డైలీహంట్

ఐదు సంవత్సరాల క్రితం.. భారతీయ మొబైల్ వినియోగదారులకు ప్రాంతీయ భాషలలో వార్తలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో మేం ‘న్యూస్ హంట్’ యాప్ ను ప్రారంభించాం.

ఆనతి కాలంలోనే న్యూస్ హంట్ దేశంలోనే అతిపెద్ద వార్తలు, ఈ-పుస్తకాల అప్లికేషన్ గా ఎదిగింది. స్థానిక భాషలలో వార్తలందించే స్థాయి నుంచి క్రమేణా ఈ-పుస్తకాలు, మ్యాగజైన్లు, కామిక్స్ అందించే స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు మేం లక్షలాది పాఠకులకు సేవలందిస్తున్నాం. అయినా మా లక్ష్యం మాత్రం మారలేదు. ఆయా భాషల ప్రజలకు వారి భాషల్లోనే వార్తలు, పుస్తకాలు అందిస్తూ పాఠక లోకాన్ని రంజింపజేయాలన్న మా లక్ష్యంలో కించిత్ మార్పు కూడా చోటుచేసుకోలేదు.

ఈరోజు మేం ప్రవేశపెడుతున్నాం మా న్యూస్ హంట్ యాప్ తదుపరి అవతారమైన – డైలీహంట్

మీరెంతో అభిమానిస్తున్న న్యూస్ హంట్ మాదిరిగానే డైలీహంట్ కూడా మీకు మరింత అనువైనది. ముఖ్యంగా ఈ యాప్ మీకు లభిస్తుంది మీ భాషలో. ఎన్నో సౌలభ్యాలతో, సరికొత్త ఫీచర్లతో కూడిన డైలీహంట్ లో మీకు నచ్చిన వ్యాసాలు, పుస్తకాలు, కామిక్స్ కనుగొనడం, చదవడం చాలా సులువు.

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే డైలీహంట్ యాప్ ను ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్ / ఐప్యాడ్ & విండోస్ ఫోన్లకు సంబంధించిన అప్ డేట్స్ కూడా అతిత్వరలోనే అందుబాటులోనికి వస్తుంది.

డైలీహంట్ లో ఏమిటి కొత్తదనం:

సరిక్రొత్త రూపం : అవును, డైలీహంట్ ఒక అందమైన, అద్భుతమైన యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా మీకిష్టమైన వార్తలు, పుస్తకాలు చదువుకోవచ్చు. పైగా ఈ యూజర్ ఇంటర్ఫేస్ పూర్తిగా మీ భాషలోనే ఉండడం వల్ల మీ అన్వేషణలో మీకెలాంటి విసుగు కలగదు.

వ్యక్తిగత సిఫార్సు: కేవలం అందమైన యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమేకాదు.. డైలీహంట్ మీ పఠనాభిరుచిని పసిగదుతుంది. దానికనుగుణంగా మీకిష్టమైన వార్తలు, పుస్తకాలు మరియు వీడియోలను సేకరించి మీకు ఎప్పటికప్పుడు సిఫార్సు కూడా చేస్తుంది. అరె.. ఇదేదో బాగుంది కదూ!

ఇష్టాంశాలు: వార్తలు లేదా పుస్తకాలు చూస్తున్నప్పుడు.. మీకు నచ్చిన వాటిని ఇష్టమైన అంశాలు లేదా మూల వనరులుగా టాగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. స్థానిక వార్తలతోపాటు సాంకేతికం, ప్రయాణం మొదలుకొని వంటకాల వరకు అన్నీ మీ భాషలోనే చదువుకోవచ్చు.

అధ్యాయాల వారీగా కొనుగోలు : ఒకవేళ మీకిష్టమైన పుస్తకం ధర మీ మొబైల్ బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు నిరాశ చెందక్కర్లేదు. ఎందుకంటే.. డైలీహంట్ లో మీరు పుస్తకాలను మీకు నచ్చిన అధ్యాయాల వారీగా కూడా కొనుగోలు చేయవచ్చు. మా పాఠకులు మరియు ప్రచురణ కర్తల అభ్యర్ధన మేరకు మేం ఈ సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.Dailyhunt chapter wise billing

కొత్త భాషలు: డైలీ హంట్ మరిన్ని భాషల పాఠకులకు కూడా స్వాగతం పలుకుతోంది. కొత్తగా భోజ్ పూరి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా అస్సామీ, సింధీ మరియు నేపాలీ భాషల పాఠకులకు కూడా అందుబాటులోకి రానుంది.

కొత్త దేశాలు : శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలోని పాఠకులకు కూడా ఇప్పుడు మేం డైలీహంట్ ద్వారా సేవలు అందిస్తున్నందుకు మాకెంతో థ్రిల్ గా ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని దేశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి.. మీరు కూడా మాలాగే అద్భుతమైన కొత్త డైలీహంట్ యాప్ ను ఆస్వాదిస్తారని మా ఆకాంక్ష!

చివరగా ..

సంవత్సరాలుగా మాతో కలిసి కొనసాగుతున్నందుకు పాఠకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీకేం కావాలో మాకు చెప్పండి.. ఎందుకంటే మేం మీ నుండి వినడానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటాం. మా డైలీహంట్ ద్వారా ఇంకా మీకేమైనా చేయగలిగినది ఉంటే, దయచేసి మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.

ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్ల కోసం డైలీహంట్ ను డౌన్లోడ్ చేసుకోండి.

– డైలీహంట్ బృందం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s