‘మూడ్’ మారిందా? ‘పుస్తకం’ మార్చండి!

Dailyhunt Logo‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..’ అన్నాడో సినీ గేయ రచయిత వెనకెప్పుడో! ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి, జరిగే సంఘటనలు బట్టి మన ‘మూడ్’ కూడా తరచూ మారిపోతూ ఉంటుంది. గంట క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఉండలేం, అలాగే మరో గంట తర్వాత ఎలాగుంటామో ఇప్పుడు చెప్పలేం. నిత్యజీవితంలో కోపం, చిరాకు, ఆనందం నవ్వు, భయం, భక్తి, నిరాశ, ఒంటరితనం, ఉత్కంఠ.. ఇలాంటి అనుభూతులన్నీ సర్వ సాధారణం. ఇలా ‘మూడ్’ మారి మనసు చెడినప్పుడు.. ఏం చేయాలో తెలుసా? ఎంచక్కా పుస్తకాలు చదవాలి. నిజమండీ.. బాబూ!
cover_73975ఉదాహరణకు.. మీకు ఉన్నట్టుండి ఏదో విషయంలో కోపం వచ్చిందనుకోండి. మీ కోపాన్ని తగ్గించుకునేందుకు, తిరిగి మీ మనసును ప్రశాంత స్థాయికి తీసుకొచ్చేందుకు ఏదైనా ‘జోక్స్’ పుస్తకం చేతిలోకి తీసుకుంటే సరి! ఓ అయిదు నిమిషాలు ఆ పుస్తకంలో యమ సీరియస్ గా తల దూర్చారంటే చాలు.. మరో అయిదు నిమిషాల్లో తెరలు తెరలుగా మీకు నవ్వొస్తుంది. అంటే- మీ మనసు ప్రశాంత స్థాయికి తిరిగి చేరినట్లే.. అప్పుడు మీ కోపం ఎటుపోయిందో మీకే తెలియదు. అలాగే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఒకోసారి మనల్ని నిరాశ, నిస్పృహలు కమ్ముకుంటూ ఉంటాయి. మన పని అయిపొయిందని, ఏం చేయలేమని చతికిల పడిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కొన్ని పుస్తకాలు చదవడం వల్ల తిరిగి ఉత్తేజితులం కావచ్చు. ముఖ్యంగా సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు మన మూడ్ ని మార్చి మనలో అంతులేని ధైర్యాన్ని నింపుతాయి.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేలా చేస్తాయి. కొంతమంది మహానుభావుల జీవిత చరిత్రలు చదివినప్పుడు కూడా మనకెంతో ఉత్తేజం లభిస్తుంది. ఇలా రకరకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే.. కేవలం జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ వంటివి మాత్రమే కాదు, మన థింకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. అసలు చదివే అలవాటు, ఓపిక మనకుండాలేగానీ ఈరోజుల్లో ఏ విషయంపైనైనా దొరకని పుస్తకమే లేదు.
క్షణంలో.. కోరుకున్న పుస్తకం!cover_55849
కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. వీటన్నిటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో చిన్నా పెద్ద అందరూ ఈ-పుస్తకాలు చదవడానికి అలవాటుపడ్డారు. రకరకాల వెబ్ సైట్లు, మొబైల్ యాప్ లు ఈ-పుస్తకాలు, ఈ-మ్యాగజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
పుస్తక ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న, అలరిస్తున్న మొబైల్ యాప్ లలో డైలీహంట్ ది అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో.. 13 భాషల్లో.. దాదాపు 10 కోట్లమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న యాప్ ఇది.
డైలీహంట్ లో ఉత్తమాభిరుచి కలిగిన పాఠకుల కోసం అనేక రకాల పుస్తకాలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, వైద్యం, వృత్తి, జ్యోతిష్యం, మతం, ఆధ్యాత్మికం, స్వయంకృషి , సంగీతం, హాస్యం, వంటలు, భాష, జనరల్ నాలెడ్జి, క్విజ్, సినిమాలు, వినోదం, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలు, నాటికలు, నవలలు, .. ఇలా ఎన్నో రకాల పుస్తకాలు, మ్యాగజైన్లను ఈ యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. పెద్దలనే కాదు పిల్లలను కూడా అలరించే జానపద కథలు, బొమ్మల కథలు, గ్రాఫిక్ నవలలు.. ఎన్నో ఇక్కడ లభిస్తాయి.
మరి ఇంకేంటి.. ఈసారి ఎప్పుడైనా మీ ‘మూడ్’ మారిపోతే.. ఏం చేయాలి? సింపుల్ గా పుస్తకం మార్చాలి.. అంతే!
ఆల్ ది బెస్ట్!!

cover_72477cover_106970cover_89617cover_102921cover_58393

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s